ఉరుములు - మెరుపులు 

చాప్టర్ 1 -  ట్యూషను 
టైం ఏడు దాటింది.. ల ల లా ..ల ల లా అని పాడుకుంటూ నీలం రంగు ఎం టి బి సైకిల్ మీద  ట్యూషను కు వచ్చాను. మనము అప్పుడు ఆరో తరగతి  . ఆ వయస్సులో సైకిల్  ఎ పెద్ద పల్సర్ కాబట్టి ఇంటి గేటు ని లెక్కచెయ్యకుండా దాన్ని సైకిల్ తో ఒక్క నెట్టు నెట్టేసి లోపలి వచ్చాను.
అంతే !
ఒక్క సారిగా ట్యూషను పిల్లలు అంతా  నా  వైపు నేరస్తున్ని చూసినట్టు చూడటం మొదలెట్టారు. ట్యూషను లో శిశు (ఎల్ కే జి  లెండి )నుండి ఎనమిది తరగతుల వాళ్ళు ఉండేవారు మరి ఆ రోజుల్లో.   ఏంటి గేటు నేట్టేస్తేనే ఇంత చూపా? సిల్లీ ఫెల్లౌస్ ! వట్టి భయస్తుల్లా ఉన్నారు అనుకోని ఆపిన  "ల ల లా" పాటను పాడుకుంటూ పిల్లల మద్యలో నుండి దూసుకేల్లాను . నేను రావడం గమనించిన ట్యూషను టీచర్  నా దగ్గరకు వచ్చింది. ఆహా ఇక ఈ పిల్లల ముందు న రేంజ్ పెరిగింది అనుకోని నా క్లాసు అమ్మాయిల వైపు ఒక చూపు చూసాను.అంతే !

ధబెల్ ! అని పెద్ద శబ్దం వినిపించింది. ఇంటి ముందు ఉన్న రోడ్ మీద వాహనాలు అన్ని ఆగిపొయ్యాయి ఒక్క క్షణం పాటు. జామ  చెట్టు మీద ఉన్న బుల్లి పిట్టలు ఎగిరిపోయాయి ఆ శబ్దం తాటికి తట్టుకోలేక. పక్క ఇంటి వాళ్ళు అంత బయటకు వచ్చారు మూల మీద ఉన్న ట్రాన్స్ఫార్మర్  పేలిందేమో అని ! ఇంక ట్యూషను పిల్లల గురించి చెప్పనక్కర్లేదు ! అవాక్కయ్యారు ఒక్క దెబ్బతో.
నా మటుకు  కళ్ళు చెమ్మగిల్లాయి , తల బద్ధలయంది, కాసేపు ఏమి వినపడలేదు. మెల్లగా తేరుకొని కళ్ళు తెరిచి చూస్తే , పక్కనే ఉన్న గీత నా వైపు నవ్వుతో చూస్తుంది ! మిగతా పిల్లలంతా నేనేదో నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు బాధతో చూస్తున్నారు. గీత నవ్వింది అనగానే అర్థం అయినది దెబ్బ పడింది నాకే అని . కానీ ఏ ? నేను చేసిన తప్పేంటి ? గేటు అలా తీస్తేనే కొట్టేస్తారా ? ఏమిటి ఈ అన్యాయం ? ట్యూషను పిల్లల ముందు పరువు పొయింది.

ఛి ఛి అని ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాను. 

చాప్టర్ 2 : రైల్వే పట్టాలు 

మూసిన కళ్ళు తెరవకుండా రెండు అడుగులు ముందుకు వచ్చి కొంచం లెగ్ సైడ్ జరిగి గట్టిగ కొట్టాను బంతిని. మా వాళ్ళు తెగ ఆనందపడిపోతున్నారు నా బ్యాంటింగ్ విన్యాసాన్ని చూసి.
55  రూపాయలు బెట్టు పెట్టాం మరి పక్క స్కూల్ వాళ్ళతో. బాల్ రైల్వే పట్టాల ఆవలి వైపు పడింది.
ఆ రోజుల్లో ఊర్లో ఎన్ని మైదానాలు ఉన్న బెట్టు మ్యాచ్ అంటే మాత్రం ఒక గంట సేపు నడిచి రైలు పట్టాలు దాటాక వచ్చే పొలాల్లో ఆడాల్సిందే.
" అక్కడ ఆడితేనే  ఆట, అలా ఆడితేనే ఆటకు అందం, సొసైటీ లో  మాకూ గౌరవం ".
అష్ట కష్టాలు పది ఎలాగో అలాగా మ్యాచ్ గెలిచాం. 5  కు 5 మొత్తం పది రూపాయలు జేబులో పెట్టుకొని ఎక్కడ పడిపోతాయో అని జేబు ని గట్టిగా పట్టుకొని సైకిల్ మీద రివ్వున ఊరివైపు బయలుదేరాం.
సాయంత్రము దాటిపాయింది ఆకాశం లో సూర్యుడు ఎర్రగా అయ్యాడు. సూర్యుడు కూడా ఇంత అందం గా ఉంటాడా ? రెండు కళ్ళు చాలలేదు చూడడానికి.

చాప్టర్ ౩ : సైకిల్ సవారి
కళ్ళల్లో నీళ్ళు వచ్చి కళ్ళు మూసుకుపోయాయి ఒక్క  సారిగా . అబ్బ అని అరిచాను. వీధి చివర రాకేశ్ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నన్ను చూసి  4 ఇంటికి సూర్యున్ని చూస్తే ఇలానే ఉంటుంది అని ఒక సటైర్ వేసాడు. అది సరే మన వాళ్ళు అంతా వస్తున్నారా ? ఆ స్కూల్ వాళ్ళకు 5 రూపాయలు అంటే ఓకే నా? ఇలా ప్రశ్నలు వేస్తుంటే మూసుక్కొని సైకిల్ ఫాస్ట్ గ తోక్కమని మరి చెప్పకే చెప్పాడు.
ఆ రోజుల్లో సైకిల్ ఎ అన్నిటికన్నా ఫాస్ట్ గ వెళ్ళే వాహనం అని మా గట్టి నమ్మకం కాబట్టి ఒక స్కూటర్ ని , ఎర్ర బస్సు ని  దాటి వెళ్ళాం. వీలుంటే రైలు ని కూడా దాటే వాళ్ళం కానీ రైలేమో మాకు అడ్డంగా వంతెన మీద నుండి పోతున్నది. మిస్ అయినది  అనుకోని పట్టాల ఆవల ఉన్న గ్రౌండ్ కి వెళ్ళాము.

చాప్టర్ 4 : ఇంగ్లీష్ వర్క్ బుక్  

ట్యూషను లో అబ్బాయిలు అంత దిక్కులు చూస్తూ నో అమ్మాయిలను చుస్తునో కాలం గడుపుతున్నారు. ఇంకో పక్క అమ్మాయిలు  లెక్కల పుస్తకాలను కూడా వదలకుండా ఒక  చేయి తో  సమాధానాలను ఇంకో చెయ్యి తో  వాళ్ళ కళ్ళను  మూసి గట్టిగ చదువుకుంటున్నారు. ఇంతలో గేటు శబ్దం అయినది. వచ్చింది రవి.
రవి నేను క్రికెట్ ఆడే స్కూల్ లో చదువుతున్నాడు. ఫస్ట్ ర్యాంక్ పిల్లాడు. మా కాలనీ లోనే ఉంటాడు. మా ట్యూషను కాకపోయినా టీచెర్ కి అతనంటే అభిమానం.రవి ట్యూషను కి వచ్చాడు ఆ రోజు.

రవి: టీచెర్ వంశీ ఉన్నాడా ?
టీచెర్:ట్యూషను లో లేదమ్మా,  ఫ్రెండ్స్ వస్తే  బయటకెళ్ళాడు.
రవి: ఓహో అలాగా.
టీచెర్: పని ఏంటి అమ్మా వాడితో ?
రవి: ఎం లేదు టీచెర్. వంశీ వర్క్ బుక్ ఒకటి తీసుకున్నాను. ఇచి వెళ్దామని వచ్చాను.
టీచెర్:అలాగమ్మ ఇటు ఇవ్వు. నేను వంశీ  వచ్చాక ఇస్తాను.
రవి: నేను వెళ్తాను టీచెర్.
టీచెర్:సరె, బాగాచదువు.

చాప్టర్ 5 : రవి పుట్టిన రోజు

ఇప్పటిలా కాకుండా ఆ రోజుల్లో మా స్కూల్ 4 గంటలకే  అయిపొయ్యేది. వెంటనే ట్యూషను మొదలయ్యేది. కుర్ర కారు వారి వారి టైం చూసుకొని మెల్లగా వచ్చే వాళ్ళు ట్యూషను కి.
కానీ ఈ రోజు ఏమో బెట్టు మ్యాచ్ ఉండిపోయింది. అప్పటికి చెప్తూనే ఉన్న వెధవలకు ఆదివారం పెట్టుకుందాం అని. 5 రూపాయలు చూడగానే కక్కుర్తి పడ్డారు సోది మొహాలు. ఇంక చేసేదేముంది ట్యూషను టీచెర్ కి ఏదో ఒకటి చెప్పి వెళ్ళడమే.
వంశీ : టీచెర్, ఈ రోజు ఫ్రెండ్ పుట్టిన రోజు
టీచర్ : ఎవరా ఫ్రెండ్
వంశీ: రవి , లొయోల స్కూల్ లో చదివే అబ్బాయి.
(ఆ అబ్బాయి కి ఉన్న క్రేజ్ చూసి పంపిచేస్తుంది లే అనుకున్న )
టీచెర్ : ఓహో అలాగా, సరె మరి ఇలానే వెళ్తావా ? స్కూల్ డ్రెస్ తో నే ?
వంశీ:పర్లేదు.
టీచెర్: ఏదో డౌట్ గ చూస్తూ, సరె వెళ్ళు మరి.

చాప్టర్ 6 : ఉరుములు  మెరుపులు

మూసుకున్న కళ్ళు మెల్లగా తెరిచా  ? పిల్లలు ఆపిన  ప్రశ్న - జవాబులను మల్లి గట్టిగ చదవడం మొదలుపెట్టారు. పక్క ఇంటి ఆంటీ నన్ను జాలిగా చూసి వెల్లిపాయింది. ఏంటి మనుషులంతా వింత గా ప్రవర్తిస్తున్నారు అనుకున్నాను.
టీచెర్: రవి పుట్టిన రోజు ఎలా జరిగింది ?
వంశీ: బాగా జరిగింది ?
టీచెర్: ఎవరెవరు వచ్చారు ?
వంశీ: మా క్లాసు బోయ్స్ కొంత మంది, ఇంక వాళ్ళ క్లాసు అబ్బాయిలు. కేకు కోసం. చిన్న కాఫీ పార్టీ లాంటిది.
టీచెర్: ఓహో , సరె గాని , గీత ఆ వర్క్ బుక్ ఇటు ఇవ్వమ్మా ?
వంశీ: ఛి ఛి . ఆ పిల్ల  వర్క్ బుక్ నాకెందుకు ? (పైకి అనే  ధైర్యం లేదనుకోండి)
గీత : ఎస్ , మేం , ఇదిగోండి.
వంశీ: అలా ఊపుతో ఊపుతూ వినయం గ నడుస్తూ ఇది ఇప్పుడు తేచి ఇవ్వడం అవసరమా ? పైగా చేతులు కట్టుకొని నిలబడి ఇటు అటు కలిపి ఒక 270  డిగ్రీలు తిరుగుతుంది. బాగా సంతోషం అనుకుంట నన్ను కొడితే.
టీచెర్: ఇదిగో నోట్ బుక్.
వంశీ:ఒక్క నిమిషం చచ్చిపోయా. రెండు కాళ్ళు వణికాయి. ఈ రోజు ఇంక నాకు మూడింది అనుకున్న. సంవత్సరం లో ఇన్ని రోజులు ఉంటె ఈ రవి గానికి ఈ రోజే దొరికిందా ? హ్మం .చేసేది ఎం లేదు. ఇంకో రౌండ్ కోటింగ్ కి రెడీ అయ్యాను ఇంక.

కొన్ని ఉరుములు మెరుపుల తరువాత, వీపు మీద నుండి విమానం పంపించి ఇంకా కొడితే మిగతా పిల్లలు బయం తో ఇక  ట్యూషను రారేమో అన్న ఒక్క కారణం తో  అమ్మ  నన్ను వదిలేసింది.

అవును మీరు విన్నది నిజమే. నన్ను కొట్టిన టీచర్ మా అమ్మే. ఆ ట్యూషన్ మా ఇళ్ళే.
అమ్మతో అబద్ధానికి దేవుడు కూడా జంకుతాడని అప్పుడర్ధమైంది.


P S : Tried to narrate the story in a Non Linear fashion. Thanks to Quentin Tarantino, Mani Ratnam and many others for the inspiration.

P S: Chronological order of the scenes - Chapter 5 , 3 , 2 , 4 ,1 ,6

P S : Special thanx to Vibbu, http://redrod.wordpress.com

P S: Next post " రామ్ యానం  - రామాయణం అంతటిది "