PART 1   

ఎస్ ఐ వరుణ్ తో : పద రా కోర్టు కి

వరుణ్ : సర్, ఇదే లాస్ట్ టైం మల్లి ఇలాంటి తప్పులు చెయ్యము వదిలెయ్యండి ఈ సారికి
సృజన్ : సర్, సిఐ గారితో మాట్లాడాము వస్తా అన్నారు. ప్రోసిజర్ ఏమైనా ఉంటె చెప్పండి.
ఎస్ఐ : ఎం మాట్లాడుతున్నారు మీరు బుద్ధి ఉందా కోర్ట్ కి ఈడుస్త మిమ్ములని కోడకల్లరా. మిగతా నలుగురిని కూడా పిలవండి అంతా కలిసి కోర్ట్ కి పోదురు. చంటి పిల్లలు అనుకున్నార్రా మీరు ? ఇంకా పాలు తాగుతున్నారు అని అనుకుంటున్నారా ఏంటి ?రోడ్ కి ఈడుస్త కొడకల్లరా ? రోడ్ మీద ఎగురుతే పోలీసులు ఉంటారని తెలియదు బే ? అమ్మను అయ్యను అందరిని పిలిచుకొని రాపొండి. కోర్ట్ టైం అవుతుంది పోండి.

నేను: ఛి . కోర్ట్ కెళ్తే మల్లి కాండక్ట్ బాడ్ అని వస్తుంది. ఎం చెయ్యకుండానే అదొక బొక్క . వీడేమో వదిలేల లేడు . పెద్ద సాడిస్ట్ లా ఉన్నాడు .
వరుణ్ సృజన్ నేను సోని : ఏంట్రా బాబు వీడు వదిలేల లేదు డబ్బులు కూడా తీస్కోనంతున్నాడు ఎవరితో మాట్లాడిస్తే ఫలితం ఉంటుందేమో. సారీ సృజన్ . బర్త్ డే రోజు కోర్ట్ కి కోర్ట్ కి తీస్కేల్తున్నాం పొద్దున్న పొద్దునే . వి ఆర్ రియల్లీ సారీ ఫర్ థిస్. ఇంట్లో ఆంటీ తిట్టుదేమో అందరిని కలిపి. మన చేతుల్లో ఎం లేదు ఇంక .హ్మం
  .
  .
  .
  .
అసలు విషయం లోకి వెళ్తే
సృజన్ పుట్టిన రోజు వాడికి ఏదైనా షాక్ ఇవ్వాలని చెప్పా పెట్టకుండా చిన్న ఒమని వాన్ లో పెద్ద సంత అంతా బయలుదేరాం. మన పిల్లవాడి ఇంటికి వెళ్ళే సరికి అర్థ రాత్రి అయింది. ఎక్కడ వస్తామేమో అని ఒక్క నాడు కూడా ఇంటి అడ్రస్ సరిగ్గా చెప్పి చావలేదు వీడేమో. వాడి ఇల్లేమో దొరకటం లేదు. ఇంటి నెంబర్ 248 అయతే 247 ఇల్లులు వెతికి చివరగా మొదలు పెట్టిన చోటికే వచ్చి పక్కనే ఉన్న సందు ఇంటి నెంబర్ చూస్తే 230 దొరికింది.దాని ఎదురుగ్గానే 248.మరి 230 లో  గీత   ఉంటుంది లెండి.ఆమెకు వీనికి పడదు అది వేరే విషయం అనుకోండి. పిల్లాడిని లేపి నాలుగు దెబ్బలు కొట్టే ఛాన్స్ ఇవ్వమంటే ఇది అలాంటి ఏరియా ఇలాంటి ఏరియా ఇక్కడ వాళ్ళు సౌండ్ ఎ బయటకు రాకుండా మాట్లాడుతారు రోజు, రాత్రిళ్ళు గుండు పిన్ను పడిన నిద్ర లేస్తారు , కాలనీ కాలనీ అంతా ఇంతే అంటే ఇంక వరుణ్ గాడు వీరావేశం ఆపుకోలేక ఎక్కించండి వీడిని బండిలో , ఎటైన దూరంగా వెళ్లి ఒంటరిగా కలిసి కొడదాం అన్నాడు. వరుణ్ అనుకుంటే అది జరిగి తీరాలి కాబట్టి వాణ్ణి కిడ్నాప్ చేసి వ్యాన్ లో ఎక్కించి బయలుదేరాం అందరం. అప్పటికే డ్రైవర్ సోని అ ఏరియా లో ఒక పది రౌండ్స్ వేసాడు ఇంటికోసం కాబట్టి మ్యాప్ అంతా బట్టి పట్టినట్టు ఉన్నాడు . జోరుగా హుషారుగా స్పీడ్ గా వెళ్తున్నాం. స్టీరింగ్ ఏమో ఇలియనా చేతుల్లా ఉండే సోని చేతుల్లో సింహా లో మన ఉగ్ర బాలయ్య చేతిలో కత్తి లా గిర గిర అని తిరుగుతుంది. వాన్ ఏమో చిన్న టర్నింగ్ వచ్చిన కూడా రెండు చక్రాల మీదే రేస్ బైక్ లా 90 డిగ్రీలు తిరుగుతుంది. చూస్తుంటే ఈ రోజు ఏదో రచ్చ జరగబోతోంది అని అప్పుడే అనిపించింది. అలానే రోడ్ మీద పోతున్నాం.

పక్కనొక పెద్ద టిమ్బెర్ డిపో కనపడింది. చూస్తే పూరి జగన్నాథ్ లాస్ట్ ఫైట్ కోసం వేసిన మాఫియా సెట్ లా ఉంది. పక్కన కాలి స్థలం ఉంది కదా అని చక్కగా వ్యాన్ ఆపి దిగి చక్కటి బమ్స్ తో ఇంక అందరం ఫోరం లోకి వచ్చాం. అంతా అమ్మా బాబు అని అరుస్తారు వీడేమో ఎంత కొట్టినా ఏడవడం ఆపేసి "పోలీసులు వస్తారు" "పోలీసులు వస్తారు" అని అరుస్తున్నాడు. మాములుగా "బమ్స్ కొట్టే అప్పుడు కాళ్ళు మాత్రమే పని చెయ్యాలి కాదని ఇంకేం పని చేసిన నెక్స్ట్ బర్త్ డే వరకు ఛాన్స్ రాదని" కొడుతూనే ఉన్నాం.

ఇంతలో ఏదో కుయుమ్ కుయుమ్ అని సౌండ్ వినపడింది.గుండె లబ్ డబ్ అనడం పోయి లాటీ లాటీ అనడం మొదలెట్టింది. ఊరకే పుట్టిన రోజు సెలెబ్రేట్ చేస్తే ఏమవుతుంది లే అని మొండి ధైర్యం తో అలానే ఉండి పోయాం.కుయుమ్ సౌండ్ పెరగడం తో ఇంక కొట్టడం ఆపి చూస్తున్నాం. ఇంతలో జీప్ ఆపి సీదా మాటల్లెకుండా రెండు లాటీలు పట్టుకొని మా మామలు దిగారు. చూస్తే పిల్లలు నీట్ గ ఉన్నారు కదా అని అనుకున్నారనుకుంట ఆకరికి జీప్ డ్రైవర్గాడు కూడా కర్ర పట్టుకు దిగాడు. కర్ర చూడగానే దెబ్బలు గుర్తుకు వచ్చి మెల్లగా, "సర్ పోతున్నాం" అని వ్యాన్ ఎక్కడానికి చూసాం. వ్యాన్ ఏమో మనది కాదు తాళం తీసుకెళ్తే ఇరుక్కుపోతం అనుకున్నాం ఒక్క నిమిషం. కానీ సోని ముందే తాళం తీసి దగ్గర పెట్టుకునే సరికి ఊపిరి పీల్చాం.

అక్కడ ఉన్న ఎస్ ఐ కి తాళం ఇవ్వక పోయేసరికి చిర్రెక్కింది. వాడు అసలే మొదటినుండి ఫాం లో ఉన్నాడు. వానికి వచ్చిన బూతు పదాలు వాడుతూ ఇంక మొదలెట్టాడు.

ఎసై : ఓయ్ ఎం చేస్తున్నారా ఇక్కడ ?
సృజన్: సర్ ఎం లేదు చిన్న పార్టీ బర్త్డే సెలెబ్రేట్ చేస్తున్నాం.
ఎసై: చిన్న పాపలు రా మీరు సిగ్గు లేదు ? ఈ టైం ఏంటి మీ పార్టీలు ఏంటి ? ఎ కాలనీ రా మీది పదండి మీ అమ్మ అయ్యా ను తీస్కోని రాపొండి పద పోలీసు స్టేషన్ కు.
వరుణ్ : సర్ తప్పయంది వేల్లిపోతం
ఎసై: ఎవడ్రా తోలింది బండి ? ఎవంది ఈ బండి ?
వరుణ్ : సర్ మా బంధువులది. ఇదే ఫస్ట్ టైం. వెళ్లిపోతాము.
ఎసై: బండి కాగితాలు తీయి ముందు నువ్వు. లైసెన్సు తీయి మీకు టైం ఎంతవుతుందో తెలుసా బొక్కలేస్తే తెలుస్తుంది అందరిని .....
సృజన్: సర్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడే ఇల్లు మాది. పదండి రా పోదాం ఇంటికి.
ఎసై: ఎం రోయ్ నకరాలు పడుతున్నావ్ బొక్కలేస్త అందరిని కలిపి మీ నాటకాలు నా దగ్గర కాదు.
వరుణ్: ఇదిగోండి సర్ RC and లైసెన్సు. సర్ అన్ని ఉన్నాయి . వెళ్తాము వదిలెయ్యండి
ఎసై : అ రెండు ఇచ్చి పోండి. పొద్దున్న స్టేషన్ కి రండి అమ్మ అయ్యన్ను వెంట పట్టుకొని. మీ సంగతి అక్కడ చెప్తా.
అంతా బండి ఎక్కి కూర్చున్నాం. డ్రైవర్ సీట్ లో వరుణ్ హ్యాండ్ బ్రేక్ పడి ఉంది. పోలీసు జీప్ స్టార్ట్ చేసి చూస్తున్నారు మేము పోతామేమో అని. బండి ఏమో రైజ్ చేస్తున్నాం ఇంచు కూడా కదలట్లేదు.
మేము: అరే వరుణ్ ఇంతకు ముందు ఎప్పుడైనా తోలావా ఈ వ్యాన్
వరుణ్ : లేదు రా ఇదే ఫస్ట్ టైం
రైజ్ చేస్తూనే ఉన్నాడు
పోలీసు డ్రైవర్: ఎ బాబు హ్యాండ్ బ్రేక్ తీయి ముందు. ఎం తోలుతున్నావ్ ?
మేము: వినిపించుకోలేదు రైజ్ చేస్తున్నే ఉన్నాం.
పోలీసు డ్రైవర్: మల్లి అరుస్తున్నాడు అదే
మేము: వినిపించుకోలేదు. ఇంక లాబం లేదు అని చెప్పి చచం అని అనుకోని డ్రైవర్ సోని ని ముందుకు పంపించాం డ్రైవ్ చెయ్యమని. పోలీసులు పెద్దగ పట్టిన్చుకోలేదనుకుంట ఎవడు తోలితే ఏంది వీళ్ళను ఇక్కడ నుండి పంపెయ్యాలి అనుకున్నారు కాబోలు. ఇంటి సందు వరకు బద్రంగా వచ్చి వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు.

రాత్రి ఇంటి మీదే మెల్లగా అరుస్తూ సెలెబ్రేట్ చేసి ఎదురింటి గీత  కు తెలవకుండా ఎలాగో అలాగా కానిచ్చేసాం.
వరుణ్ గాడు చైనా లో అర్థ రాత్రి తిరిగిన రోజులు గుర్తుకు తెచ్చుకొని కాసేపు ఇండియా లో అమ్మాయ్లె కాదు అబ్బాయిలు కూడా తిరిగే పరిస్థితి లేదు ఛి ఛి చెత్త సిస్టం అ సిస్టం ఈ సిస్టం అని సాఫ్ట్ గ వాని స్టైల్ లో గట్టిగ తిట్టుకొని , ఇంక పడుకుందాం అంటే మిద్ద మీద లైలా గాలికి చల్లగా పడుకున్నాం.

PART 2

ఏదో అక్కడొక కాంటాక్ట్ ఇక్కడొక కాంటాక్ట్ తో ఎల్ బి నగర్ పోలీసు స్టేషన్ కి లేవగానే బయలుదేరాం.తీర అక్కడకు పోతే మీ ఏరియా మా దాని కిందకు రాదు. పోయి ***** స్టేషన్ లో అడగండి అని పంపారు.
వంశీ: వరుణ్ ఇక్కడ పోలీసు ను అడుగుతే ఇలాంటి కేసులకు మరి మార్గం ఏంటో తెలుస్తుంది కదా
వరుణ్: ఏముంది ఎంతో అంత లాగుతారు దానికి వీన్ని అడిగేదేముంది తొక్క
వంశీ: అది ఎంతో తెలుస్తే బేరం చెయ్యొచ్చు కదా. మరీ ఎక్కువ అడుగుతే ఎం పీకాలి.
వరుణ్: సృజన్ వాణ్ణి ఒక సారి ఇలాంటి కేసులకు మార్గం " ఎంతో " అడుగు
పోలీసు: తాగి ఉన్నారా రాత్రి
మేము: లేదు సర్
పోలీసు : ఎం చేస్తున్నారు మరి ?
మేము: కేకు కోస్తున్నాం సర్
పోలీసు: అదే చెప్పి అడగండి ఇస్తారు. చెకింగ్ కోసం తీస్కుంటారు అలా .
మేము: ఓసి ఇంతేనా పదండి ***** కి మరి. సోని బండి తీయమ్మ.

***** పోలీసు స్టేషన్ రానే వచ్చింది.
అంతా వెళ్తే బాగోదేమో అని నేను, వరుణ్, సృజన్ మరియు సోని వెళ్ళాం స్టేషన్ లోకి మిగతా వాళ్ళు బయటే ఉండిప్యారు. మా మొహమాటం వాళ్ళ ఎంత శుభం జరిగిందో చివరికి తెలిసి వచ్చింది. ఒక్క సంతకం ఏ ఉంది మాకు కోర్ట్ కి మద్యలో. పాపం సృజన్ ! పుట్టిన రోజు అంతా పొద్దునే గుడికేల్తారు వీడేమో స్టేషన్ మెట్లు ఎక్కాడు. అంతా విధి. విధి బలీయం అయనది అంటే ఇదేనేమో. మా ఎస్ ఐ ఎ విధి కంటే బలమయిన వాడని తర్వాత గాని తెలిసింది .

స్టేషన్ అంతా నిర్మానుష్యం. పోలీసులు అంతా గవెర్నమెంట్ కూలర్లు పెట్టుకొని చక్కగా నిద్రపోతున్నారు ఉదయం పూట కూడా. ఒక్క సారి బాల లేనప్పుడు రూం లో నుండి బ్యాట్ ఎత్తుకోచ్చే ఐడియా గుర్తుకు వచ్చింది. ఆర్ సి కనపడిస్తే ఎత్తుకోద్దాం అనుకున్నాం . పోలీసు స్టేషన్ దొంగతనానికి చాల సేఫ్ అని అ స్టేషన్ చూస్తే యిట్టె గోచరించింది. పోలీసు స్టేషన్ వెళ్ళగానే దొంగబుద్ధులు వాటంతటవే వచ్చాయి !

కానీ అ ముష్టి ఎస్ ఐ మా మీద దేవి , నాగమ్మ, నాగ భైరవి లాంటి సినేమాల్లో పాముల్లాగా పగ పడుతాడని మాకు తెలియదు అప్పటికి.

సృజన్: సర్ మా ఆర్ సి ఉంది ఈ స్టేషన్ లో
పోలీసు: రాత్రి తెచ్చింది మీదేనా
వరుణ్: ఎస్ సర్. మాదే. ప్లీజ్ కొంచం ఇస్తే తీసుకొని వెళ్తాం. ఆఫీసు టైం అవుతుంది అందరికి.
పోలీసు: మాకు తెలవదు బాబు సర్ కి కాల్ చెయ్యండి. అయన దగ్గరే ఉంది.
సృజన్: ఎస్ ఐ తో : సర్ మేము స్టేషన్ కి వచ్చాం. మీరు రమ్మని చెప్పారు రాత్రి. మా ఆర్ సి ఉండిపోయింది.
ఎస్ ఐ: అక్కడే ఉండండి పది నిమిషాల్లో ఉంటా అక్కడ.
వంశీ: పిలవగానే వస్తున్న అన్నాడంటే వీడు కచ్చితంగా ఇస్తాడు లే మనకు ఆర్ సి.
వరుణ్: ఆ ఇస్తాడు రా ఊరికే. రాత్రి చూసావ్ గా డబ్బులు తీస్కుని గాని ఇచ్చేలా లేడు వాడిని చూస్తుంటే
సృజన్: అదిగో వస్తున్నాడు.
వంశీ: ఏంటి ఈ సూపర్ కూల్ లుక్. రాత్రేమో మంచి రఫ్ లుక్ లో ఉండే పిల్లాడు. డ్యూటీ లో "ఉగ్ర నరం - మాన్ విత్ మసిల్" అనుకుంట మనోడు.
సృజన్: రానియ్యి కూల్ ఓ హాట్ ఓ తెలుస్తుంది. నువ్వు మాత్రం జోకులు వెయ్యకు వాని ముందు.
సోని: అందరు కాం గ ఉండండి. నవ్వకండి వాడి ముందు.

ఎస్ ఐ అలా గంభీరంగా పోలీసు స్టేషన్ బాత్రూమ్స్ కెళ్ళి తీరిగ్గా వచ్చి లోనికి వెళ్ళాడు. పిల్లాడు ఇంక నిద్ర మబ్బులోనే ఉన్నాడు అనుకుంట.

ఎస్ ఐ పోలీసు తో : రమ్మను అ పిల్లలను.
సోని: పద పిలిచాడు.

ఎల్ కే జి లో ఎప్పుడో అలా చేతులు కట్టుకునే వాళ్ళం మా లెక్కల మాస్టారు పలక పట్టుకొని రమ్మని పిలిచినప్పుడు . నేను అయతే మల్లి అంత వినమ్రంగా కట్టుకోడం మల్లి ఇదే.

సృజన్: సర్ ఆర్ సి ?
ఎస్ ఐ: మిమ్ములని బొక్కలేస్త. కోర్ట్ లో ఇస్తా అక్కడ తేల్చుకోండి మీ ఎవ్వారం.
సృజన్: సర్ తెలియక చేసాం. స్టూడెంట్స్ సర్ మేము.
ఎస్ ఐ: స్టూడెంట్స్ ఆ? ఎం చంటి పిల్లల మీరు ? పాలు తాగుతున్నార ఏంటి చిన్న పిల్లల్లాగా ? అర్థ రాత్రి పార్టిలు చేస్తారు ఏమనాన్ అంటే స్టూడెంట్స్ అంటారు.తోముత ఒక్కొక్కన్ని .
వరుణ్: సర్, ఇదే ఫస్ట్ టైం తెలియక చేసాం.
ఎస్ ఐ: మేము ఎవరిమో తెలుసా ? పోలీసులం. మీకేం అయ్యా సూర్యుడు ఉదయించిన తర్వాత పోతారు మల్లి చీకటి పడక ముందే వస్తారు పోలీసు అంటే ఏమనుకున్నావ్ ?
ఎస్ ఐ సృజన తో : మాకు ఎన్ని గంటలు డ్యూటీ ఉంటాదో తెలుసా నీకు అసలు ?
సృజన్: సర్, "రౌండ్ ది క్లాక్ " ఉంటుంది మీది
ఎస్ ఐ: అది అర్థం అయనది కదా పోలీసు అంటే ఏంటో ? ఏమనుకున్నావ్ "under cover memu"
సృజన in english: Sir,actually We didn't know that and bla bla bla
ఎస్ ఐ: ఎం ఇంగ్లీష్ మీకొక్కరికే వస్తది అనుకుంటున్నారా ? మాకు మీలాగా ఇంగ్లీష్ రాదు. ఎక్కువ తక్కువ చేస్తే తోక్కుతాం అందరిని కలిపి. ఆయన మీరు వినరు చెప్తే. కోర్ట్ కి పదండి.రోడ్ కి ఈడుస్త మిమ్ములను అంతా.
వరుణ్ : సర్, స్టూడెంట్స్ సర్ చూడండి.
ఎస్ ఐ: ఎం స్టూడెంట్స్ ర మీరు. అర్థ రాత్రిళ్ళు పార్టీలు మీరు ఎం స్టూడెంట్స్ రా?
సృజన్: తప్పయంది సర్. కావాలంటే చుడండి మేము IIIT స్టూడెంట్స్
ఎస్ ఐ: ఎం IIIT ఎక్కడ అది ?
వంశీ మనసులో: హమ్మయ్య ఇంక కాలేజీ పేరు మీద ఆయన వదిలేస్తే బాగుండు.సాడిస్ట్ లా ఉన్నాడు సాలె గాడు.
సృజన్: ఇదిగో సర్ కాలేజీ ఐ డి కార్డు.
ఎస్ ఐ: ఎంత నీ పర్సెంటేజ్ ?
సృజన్: సర్, అది (అని ఆలోచిస్తూ అటు ఇటు చేసి ఒక) 80 ( చెప్పాడు.)
వంశి: ఈ దెబ్బతో వదిలేస్తాడు హి హి .
ఎస్ ఐ: ఏంటి 80 ఎ నా ? ఎం చదువయ్య అది ?
సృజన్: సర్ అది మరి.....( అంతా షాక్ లో ఉన్నాం అసలు మార్కులు చెప్తే అక్కడే బొక్కలేసే వాడేమో అని)
ఎస్ ఐ: మా వాడు ఉన్నాడు తెలుసా ?
మేము: తెలియదు సర్.
ఎస్ ఐ: VIT లో చదువుతున్నాడు 92% తెలుసా ? పోలిసుల పిల్లలు కూడా చదవుతారు ఏమనుకున్నావ్ ?మీకొక్కరికే వస్తున్దనుకున్నావా చదువు ?
వరుణ్: అరే ఈ ******* గాడు ఎందుకు పిలిపించాడో చెప్పకుండా ఈ కథలు ఏంటి ?
సృజన్: నువ్వు ఉండు ఆవేశపడకు.
ఎస్ ఐ సృజన్ తో : నీకు VIT తెలుసా ?
సృజన్: తెలుసు సర్.
ఎస్ ఐ: ఎం తెలుసోయ్? ఎక్కడ అది చెప్పు ?
సృజన్: సర్ అది వెల్లూరు లో ...
ఎస్ ఐ: హమ్ తెలుసు కదా ? ఇప్పుడు చెప్పు పోలిసుల పిల్లలు చద్వుతరో లేదో ?
వంశి సోని తో : ఈ ****** గాన్ని పోలిసుల పిల్లల గురించి ఎవడు అడిగాడుర బాబు ? పొలిసుల పిల్లలు చదవరని ఎ ఐటెం గాడు అన్నాడో కానీ ఈ ఐటెం గాడు మన మీద పడ్డాడు.
సోని: హే నువ్వు చప్పుడు చెయ్యకుండా కూర్చో. నవ్వకు వాని ముందు. ఆపుకో.చూస్తే ఐటెం గాడు కోర్ట్ అంటాడు మల్లి.ఏదో క్లాసు పీకుతున్నాడు పీకనివ్వు.
ఎస్ ఐ సృజన్ తో: 92 % ante మంచిదా కాదా ?
సృజన్: సర్ అంటే ....చాల చూడాలి..(వీని స్టైల్ లో డిప్లొమాటిక్ ఆన్సర్ కోసం చూసాడు - ఎవరి ఈగో కోసం వారు తెగ కష్టపడుతున్నారు మరి )
ఎస్ ఐ: ఎం మంచిదా కదా ?
సృజన్: ఒక్క నిమిషం ఆర్ సి వైపు చూసి, సర్ మంచిదే.
ఎస్ ఐ:ఏమనుకున్నావ్ పోలీసుల కొడుకులంటే ? అండర్ కంట్రోల్ మరి. మీరు పావురాలు . ఎం పావురాలు తెలుసు కదా ?
వరుణ్: తెలుసు సర్.

ఎస్ ఐ:ఎం తెలుసు అయ్యా నీకు ?ఎం తెలుసు ? రాత్రిళ్ళు రోడ్ల మీద తిరగడం తెలుసు.ఇదేనా మీకు చెప్పింది కాలేజీ లో ?
వంశి: వీడు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇక్కడికే వస్తున్నాడు.ఈ సారి మల్లి వేరేది చెప్పే లోపే అడిగీ రా వరుణ్ అసలు తప్పేంటి అని ?
ఎస్ ఐ వరుణ్ తో: నీ మార్కులు ఎన్ని అయ్యా ?
వరుణ్: 97% సర్
ఎస్ ఐ: ( సౌండ్ లేదు కాసేపు ) అట్లయితే ఎంసెట్ ర్యాంక్ ఎంత ?
వరుణ్: సర్ 300
ఎస్ ఐ: ( మైండ్ బ్లాక్ ఆయనది , వాళ్ళ పిల్లాడి కంటే బాగా చదివే వాళ్ళను ఫస్ట్ టైం చూసాడు కాబోలు )
వంశీ: నెక్స్ట్ నన్నే అడుగుతాడు . ఇంకా రెడీ చేస్తున్న ఒక 95%, ఎంసెట్ 50 , aieee 500 అలా ఆలోచిస్తూ ఉంటె ...వరుణ్ ఇచిన షాక్ లో నుండి ఇంకా రాలేదనుకుంట బయటకు వాడు... ఇంకా మార్కులు అడుగుతే దొరకట్లేము ఎని చెప్పి...తిట్టడం మొదలుపెట్టాడు.

ఎస్ ఐ:మాకు మీలాగా ఇంగ్లీష్ రాదు తెలుసా ? బట్లర్ తెలుగు మాది మీ ఆంధ్ర విజయవాడ తెలుగు కాదు ఇది ఏమనుకున్నావ్ అర్థం అయిందా?
సృజన్: సర్, అర్థం అయనది.
ఎస్ ఐ: ఎక్కడున్నా ? ఆ పావురాలు. ఇంగ్లీష్ లో ఏమంటారు పావురాలను ?
సృజన్: సర్ పీజియన్స్ అంటారు.
ఎస్ ఐ: అ అగ్గాద్దె. మాకు ఇంగ్లీష్ వచ్చు ఏమనుకున్నారు మీరు ?
వంశి: ఈ ***** గాడు ఇప్పుడే కాద ఇంగ్లీష్ రాదు అంది.అసలు పని ఆపి ఈ గోల ఏంది వీనిది ?
సోని:అరే నువ్వు ఉండు రా బాబు. అరవకు.
వరుణ్:నువ్వు కాం గ ఉండు.
ఎస్ ఐ వరుణ్ తో:ఏంటి నీ సంగతేంటి ? మిమ్ములను తోమాలయ్య ? రోడ్ కి ఈడుస్త ఒక్క్కోక్కన్ని. పదండి కోర్ట్ కి.డ్రైవర్ అ పేపర్స్ తీస్కోని రా.మిమ్ములను పావురాళ్ళ పెంచే సరికి ఇలా తయారయ్యారు.మీ సంగతి చెప్తా ఉండు.ఎ కాలేజీ అన్నారు మీరు ?
సృజన్: సర్, IIIT. గచ్చిబౌలి లో ఉంటది.
ఎస్ ఐ: ఇప్పుడు చెప్పు మా వాడు గొప్ప కదా ? 92 % in VIT
సృజన్: సర్ గొప్పే.
వంశి:ఈ దెబ్బతో వీని ఈగో అంతా పోయి ఉంటుంది.హమ్మయ్య.
ఎస్ ఐ:ఆయన మీకు బుద్ధి రాదయ్య ఎన్ని సార్లు చెప్పిన కూడా మిమ్ములను కోర్ట్ కి పంపించాల్సిందే 50 రూపాయలు ఫైన్ కట్టించాల్సిందే. వెళ్లి బయట నిలబడండి.
వంశి: వీడు ఏంటి రా బాబు అన్ని చెప్పి మళ్లీ మొదటికి వస్తాడు ప్రతి సారి. ఏమని కోర్టుకు తీస్కేల్తాడో నాకు మాత్రం అర్థం కాట్లేదు. అరే రాత్రి రోడ్ మీద బండి ఆపాము అంతే కదా.దొంగలను పట్టుకోండి రా బాబు అంటే మనల్ని పట్టుకొని టైం వేస్ట్ చేసుకుంటాడు ఏంటి రా బాబు వీడు.

అలా ఒక గంట బయట నిలబడి వాణ్ణి చూస్తూ చూడనట్టు, వాడు మా చుట్టే తిరుగుతూ ఇంత తిట్టి వీళ్ళను డబ్బులు అడుగుతే బాగోదేమో అని చూస్తూ అడగాలా వద్దా అని ఆలోచిస్తూ "కొంటె చూపులతో అరే కొంటె చూపులతో " అని ఒక గ్రూప్ సాంగ్ వేసుకున్నాము అంతా.


PART 3

ఇంతలో దేవుని దయ వల్ల సృజన్ కి కాంటాక్ట్స్ బుక్ లో ముల్లోకాలు ఉంటాయి కాబట్టి అందులో నుండి **** సి ఐ కి ఫోన్ కలిపించాము తెల్సిన వాళ్ళతో. సి ఐ గారు మంచి జిల్ జిల్ జిగ టైపు అన్నమాట. "చూసి చూడడం" అన్నట్టు వదిలేసాడు.

ఇంక ఈ తొక్కలో ఎస్ ఐ తో మన పనేమిటి అని వాడికి వెళ్లి చెప్పాం బాబు పార్థు నీ ఆటలిక చాలవు. నీ కుష్మండం బద్దలయింది. మేము సి ఐ కి కాల్ చేసాము. వచ్చి మా సంగతి నీ సంగతి చూస్తారు అన్నారు అని చెప్పాము.

ఇంక వాడు అనకొండ లో పాము లేచినట్టు లేచాడు మా మీదకు. లైలా తుఫాను లో తీరం మీద కొబ్బరి చెట్టులా ఊగిపోతున్నాడు.

ఎస్ ఐ: చేసారు కదా సి ఐ గారికి ఫోన్. ఇంక నేను ఎందుకు మద్యలో. కోర్ట్ కి పంపిస్తా. మీరు సర్ తేల్చుకోండి. ఆయన చెప్పిందే నేను చేశా. నా చేతిలో ఉన్నవి ఎంటో తెలుసు కదా కోర్ట్ ఫోరమ్స్ ఇవి. మీ పేర్లు అన్ని రాసి పడేసి పంపిస్తే మీ జీవితాలు నాశనం అవుతాయి . మద్యలో మా కెరీర్స్ అది ఇది అంటే ముచ్చటే లేదు.
ఎస్ ఐ: ఎం పెర్లయ్యా మీవి ?
సృజన్: టకా టకా స్కూల్ లో గొడవ చేస్తే బోర్డు మీద పేర్లు రాసి ఇచినట్టు నిక్ నేమ్స్ అన్ని రాసి ఇచ్చాడు నలుగురివి.
ఎస్ ఐ: ఏంటయ్యా ఇవి. ఎం పేర్లు ఇవి. ఇట్లేన పేర్లు ఇచ్చేది. మొత్తం ఇంటి పేరు అడ్రస్ అన్ని రాసి ఇవ్వు.

అలా మెల్లగ నలుగురి పేర్లు రాసుకొని. మిగతా నలుగురి కోసం సత విధాల ట్రై చేసి. మళ్లీ బయటకు వెళ్ళాడు. ఎన్ని ప్రశ్నలేసిన ఎన్ని తిట్టిన మౌనమే సమాధానం అని అలానే స్తంబల్లా నిల్చున్నాము.
చివరకు వాడె లేచి మళ్లీ బయటకెళ్ళాడు.

మేము చేసినది ఎంటో తెలియకుండా, తప్పేంటో తెలియకుండా వాడు ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తున్నాడు. అదే కాలనీ లో పదివేలు పోయాయంట అది మీరే అని కేసు రాస్తా అంటాడు మధ్యలో.మేము మాత్రం "మౌనమేల నోయీ" అని మళ్లీ ఒక గ్రూప్ సాంగ్ వేసుకున్నాం.అలానే నిల్చున్నాం.మాకు అర్థం అయంది సి ఐ వచ్చే లోపు ఇంత లాగి పంపిద్దామని అనుకుంటూ ఉన్నాడని.

రెండు గంటలయ్యింది సి ఐ రానే వచ్చాడు. వీళ్ళు డబ్బులు ఇవ్వలేదనో లేక వాని ఈగో చల్లారకో గాని చస్తే ఒప్పుకోడు సర్ వదిలేయండి అంటే.

ఇంక సి ఐ దగ్గరు వెళ్దాం అని చెప్పి వెళ్ళాం.
సృజన్: సర్ ఇలా ఫోన్ చేయించాము ....
సి ఐ: రాత్రి పూట పార్టిలు ఏంటయ్యా ? మీకు మా దిమాక్ కరాబ్ చేస్తారు.పోలీసులు ఉంటారని తెలవదా మీకు ? ఎవరు పట్టుకున్నది ?
సృజన్: సర్ అది మన ఎస్ ఐ గారు.
సి ఐ: ఎస్ ఐ అని పిలవండి (పోలీసు తో )
సి ఐ ఎస్ ఐ తో : ఎక్కడ దొరికారు వీళ్ళు ?
ఎస్ ఐ: మన **** నగర్ రోడ్ మద్యలో.
సి ఐ: ఎం చేస్తున్నారు ?
ఎస్ ఐ: బర్త్ డే అంట రోడ్ పక్కన షెడ్ పక్కన బండి ఆపి ఎగురుతున్నారు.
సి ఐ: తాగి ఉన్నారా ?
ఎస్ ఐ: లేదు
సి ఐ:మంద మంద ఉన్నారా ?
ఎస్ ఐ: లేదు
సి ఐ:అయతే పేర్లు రాసుకొని పంపిచేసేయ్
ఎస్ ఐ: ఓకే సర్.

వంశి:వీని దూల తీరింది.అప్పుడే వదిలి ఉంది చావోచు కదా.నిలబడి నిలబడి కాళ్ళు ఉన్నాయో లేవో తెలియకుండా చేసాడు.

సృజన్ ఎస్ ఐ తో: సర్ మరి ఆర్ సి ?
ఎస్ ఐ: పని పాట లేదనుకున్నావా ఏంటి మాకు ? పోయి బయట నిలబడండి పిలుస్తాం.
వరుణ్: వీడు శాబాష్ శాడిస్ట్ లా ఉన్నాడు. పదండి .
సోని:పోయి సి ఐ కిటికీ ఎదురు నిలబడుదాం. వాడె మళ్లీ చెప్తాడు ఎస్ ఐ కి పంపించమని.
సృజన్: బాబు వాని ఈగో రెట్టింపు అయి రోజంతా నిలబెట్టిన నిలబెడుతాడు.ఎస్ ఐ కి కనపడేట్టు నిలబడదాం.

అలా ఒక గంట నిలబడితే పిలిచాడు లోపలకు.

ఎస్ ఐ:ఎవరిదయ్యా బండి?
వరుణ్:సర్ అంటే అది మా బంధువులది.
ఎస్ ఐ: బండి నెంబర్ ఎంత ?
వరుణ్:గుర్తుకు లేదు సర్.
ఎస్ ఐ: ఎం గుర్తు ఉంటాడయ్య మీకు. పోయి సి ఐ గారికి చెప్పండి బండి నెంబర్ తెలవదు అని ఇవ్వను అని చెప్పాడు అని చెప్పండి.

ఇంతలో సృజన్ కి పిచ్చెక్కింది. నీ ఎంకమ్మ  అని రంగం లోకి దిగాడు సి ఐ అండ చూస్కొని.
సృజన్: సర్ అసలు మేము ఎం చేసామో చెప్పండి ? ఎం చెయ్యకుండానే ఏంటిది ?
ఎస్ ఐ:(గట్టిగ అరుస్తూ) చాక్ పీస్ ఇయ్యండి రా ఎవరైనా ? ( DTS లో కూడా అంతా సౌండ్ రాదు). నీకు ఇప్పుడు బోర్డు మీద బొమ్మలు గీసి చెప్తా ఉండు.
వంశి సోని తో : బి టెక్ కాద మనము అని ఈ నా కొడుకు బాగా కటింగ్ ఇస్తున్నాడు. బోర్డు అంట చాక్ అంట. ఎంటో వీడు వీని ఓ ఎ .
ఎస్ ఐ వరుణ్ తో: చాక్ పీసు ఉందా ?
ఎస్ ఐ సోని తో: నీ దగ్గర ఉందా ?
ఎసి ఐ పోలీసు తో : ఏమయ్యా చాక్ పీసు ఉందా ? వీళ్ళకు అర్థం కాట్లేదంట వీళ్ళు ఎం చేసారో ?

చివరకు చాక్ పీసు లేకపోవడంతో అటు ఇటు అరిచి మీరే దొంగలని kesu పెడుత. పది వేలు మీరే కొట్టేసారని పెడుత ఎం చేస్కుంటారో చేస్కొండి.రోడ్డుకి ఈడుస్త మిమ్ములను కొడకల్లరా. ఏమనుకుంటున్నారు అసలు మీరు. పదండి కోర్ట్ కి.

వంశి:ఆహా అటు పోయి ఇతి పోయి మళ్లీ కోర్ట్ కే వచ్చాడు కదా వీడు. వీనికి డబ్బులు కావాలా ? మేము కోర్ట్ కి పోవడం కావాలా ? వీని ఈగో తీర్చాలా ? ఎం చెయ్యాలో అర్థం కాకుండా దిక్కులు చూస్తూ కూర్చున్నాం.

ఎస్ ఐ:ఎం చేస్తున్నరు ఇక్కడ ? పోండి బండి నెంబర్ రాస్కోని రాపొండి.
ఇంక లాబం లేదనుకొని ఫోన్ చేసి బండి నెంబర్ చెప్పాము.
వరుణ్: సర్, బండి నెంబర్ ******
ఎస్ ఐ:అప్పుడే పోయి వచ్చారా ?
వంశి: సి ఐ లేని టైం లో వస్తే డబ్బులు లాగుదామని అనుకున్నాదేమో పాపం.
సృజన్: సర్ ఫోన్ లో అడిగాము.
ఎస్ ఐ: నాలుక పళ్ళ మధ్యలో మడతేసి ఉమ్మ్ ఉమ్మ్ అంటూ పక్కనోల్లను చూస్తూ తల ఊపుతూ పిల్లలను చూసావా ఎంత ఫాస్ట్ ఓ ? ఫోన్స్ కాల్స్ ఉమ్మ్ ఉమ్మ్ అంటున్నాడు నవ్వుతూ .
వంశి: డౌట్ లేదు వీడు తేడ మనిషే.
ఎస్ ఐ వరుణ్ తో: పరీక్ష అయ్యాక ఎ ప్రశ్న కి ఎ ఆన్సర్ రాసారు అంటే గుర్తు ఉండాలా వద్దా ?
వరుణ్: గుర్తు ఉండాలి సర్.
ఎస్ ఐ: మరి బండి నెంబర్ ఎందుకు మర్చిపోయారు ?
వంశి వరుణ్ సృజన్ సోని: అందరికి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు దానికి దీనికి సంబందం ఏంటి అనేది ? ఎం చెప్పాలో తెలియక దిక్కులు చూస్తున్నాం ?
ఎస్ ఐ అక్కడే ఉన్న ఇంకో అతనితో: ఏమయ్యా నువ్వు కూడా బి టెక్ చేసావా ?
అతను: చేశాను సర్.
ఎస్ ఐ: మరి నువ్వు చెప్పు కరెక్టే కదా నేను అనేది ?
అతను: ఎస్ సర్. (సారీ అని మా వైపు మొహం పెట్ట్టాడు )
వరుణ్ సోని తో: పాపం అతను మాత్రం ఎం చేస్తాడు. దొరికిందే సందు అని ఎస్ ఐ సైడ్ జాయిన్ అయ్యాడు.హమ్

మేము మాత్రం ఇంక అ రెంటికి లాజిక్ అర్థం కాక అలానే చూస్తున్నాం. ఎస్ ఐ చేతిలో ఉన్న ఆర్ సి వైపు. ఇంక ఈ పోరగాల్లు డబ్బులు ఇచ్చేలా లేరు అని చెప్పి ఇలా అన్నాడు.

ఎస్ ఐ: రేపు వస్తార మళ్లీ ?
సృజన్: లేదు.
వంశి: రేపు అడుగుతాడు ఏమో డబ్బులు కాబోలు !
ఎస్ ఐ: మిమ్ములను ఇంత సేపు ఎందుకు నిలబెత్తనో తెలుసా ?
వరుణ్: (చప్పుడు లేదు )
ఎస్ ఐ ఇంకో మనిషితో : పోరగల్లకు బుద్ధి రావాలయ్యా
ఎస్ ఐ:హమ్ సరే .... ఇదిగోండి ఆర్ సి..

వంశి సృజన్ సోని వరుణ్: గుండె ఝల్లుమంది అని ఒక గ్రూప్ సాంగ్ వేసుకొని మళ్లీ పోలీసు స్టేషన్ లోకం లోకి వచ్చి టక్కున తీసుకున్నాం ఆర్ సి ని :)

ఎస్ ఐ: పోండి. ఈ సారి వదులుతున్న. మళ్లీ కనపడ్దరూ బిడ్డ పిండేస్త అని రెండు చేస్తులతో లైవ్ ఆక్షన్ చూపించాడు. ఆర్ సి మా చేతులో ఉండే సరికి శాడిస్ట్ గ కనపడ్డ ఎస్ ఐ సడన్ గా మన బ్రహ్మి ల కనపడ్డాడు మా కళ్ళకు అ ఆక్షన్ లో.

అంతా కల్సి సి ఐ కి థాంక్స్ చెప్పి మళ్లీ ఎస్ ఐ రూం నుండి బయటకు వెళ్తున్నాం.సోని కి దూల ఆగక ఎస్ ఐ కి థాంక్స్ చెప్పబోయాడు.

సోనీ ఎస్ ఐ తో : సర్, థాంక్స్.
ఎస్ ఐ: (అర్రోగంట్ గ) దేనికి ?
(అనుకున్నాం డబ్బులు ఇవ్వకుండా మొండి గా నిలబడ్డామని కాబోలు అని )

అంతా కలిసి దగ్గరలో టిఫిన్ తిని బర్త్ డే బాయ్ సృజన్ ని ఇంట్లో దిగబెట్టి కాలేజీ కి బయలు దేరాం ఇంక. అది మన "పద , కోర్ట్ కి పద". సినిమాలో తప్ప ఎప్పుడు పోలీసు స్టేషన్ చూడలేదని అనుకునేవాన్ని.అ ముద్దు ముచ్చట ఇలా సృజన్ పుట్టిన రోజు తీర్చుకున్న.

కొసమెరుపేంటంటే క్లాసు కి, మెస్ కి, హోటల్ కే కాదు పోలీసు స్టేషన్  కి కూడా కల్సే పోయాం అంతా :) అని సంబరపడ్డా నా మటుకు.

8 comments:

  1. maanchi boni babai... aapaku ika.

    ReplyDelete
  2. :P :P
    what a narration boss, hats off to you :)
    closing lo, konchem over chesi unte akariki court ki kudha velle varu kadha :)

    ReplyDelete
  3. hey vamshi...cool man...keep goin..

    ReplyDelete
  4. @red rod: tappakunda
    @sainath: thank you, Vani ego satisfy ayye varaku unchukunnadu le :)
    @BB: Thanx.

    ReplyDelete
  5. vamsi, 2 gud narration!! well cine range lo oka cycle chain, hockey bat n climax lo oka court scene unte adiri poyedi! oka pandu, oka simha, oka ACP RamaChandra lantivi lekunda, neat ga undhi :)

    ReplyDelete
  6. baboi, kekalu putinchesaru kada. ee bday inka marichi poru le :).

    ReplyDelete
  7. vam.... champesav ra ni story thooo.... writter aiepovachu raaa.... action okatae missing.... super..!!!

    ReplyDelete
  8. @lalli-thanx,akkada bums istha ante ne anti social element ani God Srujan edusthunnadu..so avi kudaraledhu inka.
    @sundeep-hehe.
    @sudarshan-thanx,Action untundani anukunnam PS lo..bathikipoyam :)

    ReplyDelete